Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Jasprit: లంకతో వన్డే సిరీస్ కు బుమ్రా దూరం

Jasprit: లంకతో వన్డే సిరీస్ కు బుమ్రా దూరం

నాలుగు నెలల తర్వాత క్రికెట్ జాతీయ జట్టులో చేసిన పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ ఆడడం లేదు. ఈ విషయాన్ని బిసిసిఐ వర్గాలు  వెల్లడించాయి. నాలుగు నెలల విశ్రాంతి అనతరం బౌలింగ్ లో అతనికి మరింత ప్రాక్టీసు అవసరమని, ముందు జాగ్రత్త చర్యగానే అతన్ని దూరం పెట్టాల్సి వచ్చిందని తెలిపారు.

వెన్ను నొప్పి కారణంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు బుమ్రా దూరమయ్యాడు. సౌతాఫ్రికా, ఆస్ట్రాలియా జట్లతో స్వదేశంలో జరిగిన వన్డే, టి 20 సిరీస్ లతో పాటు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి 20 వరల్డ్ కప్ టోర్నమెంట్  లో కూడా అతడు ఆడలేకపోయాడు. అప్పటినుంచి బెంగుళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. గత వారం బుమ్రా పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లు అకాడమీ అధికారులు బిసిసిఐకి వర్తమానం పంపారు. దీనితో శ్రీలంకతో స్వదేశంలో జరుగుతోన్న వన్డే సిరీస్ కు బుమ్రాను ఎంపిక చేస్తూ బిసిసిఐ గత వారం నిర్ణయం తీసుకుని ఈ మేరకు జట్టు వివరాలు కూడా ప్రకటించింది.

మూడు టి 20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు లంక జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. టి20 సిరీస్ ను ఇండియా 2-1 తేడాతో గెల్చుకుంది.  ఈనెల 10,12, 15 తేదీల్లో గువహటి, కోల్ కతా, త్రివేండ్రం వేదికలుగా వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.  మొదటి వన్డేలో పాల్గొనేందుకు బుమ్రా జాతీయ జట్టుతో ఇంకా చేరలేదు.

గత వారమే పూర్తి ఫిట్ నెస్ సాధించిన బుమ్రాను వెంటనే బరిలోకి దింపడం కంటే కొద్ది రోజులు విశ్రాంతి ఇవ్వడం ద్వారా రాబోయే కీలక టోర్నమెంట్ లకు అతడిని రంగంలోకి దించొచ్చని బిసిసిఐ భావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్