Saturday, January 18, 2025
Homeసినిమాబ‌న్నీ గురించి దుల్క‌ర్ ఏమ‌న్నాడో తెలుసా.?

బ‌న్నీ గురించి దుల్క‌ర్ ఏమ‌న్నాడో తెలుసా.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే.. మాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలుగు హీరో అల్లు అర్జున్. అక్క‌డ బ‌న్నీకి ఫ్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ తరహాలో మలయాళంలోనూ పేరు తెచ్చుకోవాలని పలువురు హీరోలు ప్రయత్నించినప్పటికీ వర్క‌వుట్ కాలేదు.

బన్నీ తమకెంతో  ప్రత్యేకమని సందర్భం వచ్చిన ప్రతీసారి అక్కడ అభిమానులు చాటుతూనే ఉన్నారు. స్టైలిష్ స్టార్ నటించిన సినిమాలన్నీ దాదాపు మాలీవుడ్ లో రిలీజ్ అవుతుంటాయి. అక్కడ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటాయి. మాలీవుడ్ లో హ్యూజ్ మార్కెట్ కల్గిన తెలుగు స్టార్  బన్నీ.

ఇదిలా ఉంటే.. బన్నీ మాలీవుడ్ క్రేజ్ గురించి అక్కడి సూపర్ హీరో దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ దుల్కార్ ఏమన్నారంటే… కేరళలో అల్లు అర్జున్ పెద్ద స్టార్. అంతేకాదు కీలకమైన తరుణంలో మలయాళం సినిమా స్పాన్ ని పెంచారు. మ‌లయాళ సినిమా ప్రధానంగా సీనియర్ స్టార్స్ తో నడుస్తోన్న సమయంలో అతను అక్కడ ఎంట్రీ ఇచ్చారు.  యువ రక్తాన్ని ప్రోత్సహించడానికి మా  ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని నిరూపించిన యంగ్ స్టార్ అతనే. యువ తారలు పరిశ్రమలో పెద్ద ఎత్తున రాణించగలరని బన్నీ నిరూపించారు అన్నారు. దుల్కార్ సల్మాన్ వ్యాఖ్యలతో బన్నీ స్థాయి మరింత పెరిగిందని చెప్పొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : ‘హ‌ను-మాన్’ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసిన దుల్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్