Thursday, April 25, 2024
Homeసినిమా‘హ‌ను-మాన్’ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసిన దుల్కర్

‘హ‌ను-మాన్’ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసిన దుల్కర్

అ!, క‌ల్కి, జాంబిరెడ్డి వంటి డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్రాల‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి స‌క్సెస్‌ల‌ను అందుకున్నారు క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌. హ‌ను-మాన్ చిత్రం ద్వారా మరో వినూత్న ప్రయత్నానికి అయన శ్రీకారం చూట్టారు. ‘జాంబీరెడ్డి’ లో ఆక‌ట్టుకున్న తేజా సజ్జాతో కలిసి ఈ సినిమాకు పనిచేస్తున్నారు.

‘హను-మాన్’ మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ. సినీ ప్రేక్షకులకు ఓ విజువల్ ట్రీట్ అందిచనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు అంజనాద్రి ప్రపంచం నుండి హనుమంతుడిని పరిచయం చేసే 65 సెకన్ల ఫస్ట్ గ్లింప్స్ ను  హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ప్రశాంత్‌ వర్మ బర్త్‌ డే సందర్భంగా విడుద‌లైన ఈ ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌లో తేజ సజ్జా నెవ్వర్ బిఫోర్ అన్నట్టుగా కనిపిస్తున్నారు.

తేజ గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అతను ప్రింటెడ్ షర్ట్, తెల్లటి పైజామా ధరించి కనిపిస్తున్నాడు. మెడలో అద్భుతమైన సిల్వర్ కలర్ లాకెట్టు కనిపిస్తోంది. ఈ చిత్రం కోసం అంజనాద్రి అనే కొత్త, ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. వీడియోలో తేజ సజ్జా అడవిలో పరిగెత్తడం, జార‌డం, దూకడం, స్లింగ్‌షాట్‌ను షూట్ చేయడం కనిపిస్తుంది. సూపర్ హీరో గట్టిగా భూమిని తాకినప్పుడు..అత‌ని పంచింగ్ పవర్ ఏంటో చూపించారు. సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ మ‌రియు గ్లింప్స్ మ‌నల్ని అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి.

శ్రీ‌మ‌తి చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో కె. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, వెంక‌ట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూస‌ర్‌, కుశ‌ల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్