బ‌న్నీ-మురుగుదాస్ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యిందా?

Bunny-Murugadas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో పుష్ప సినిమా రూపొంద‌డం.. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం తెలిసిందే. ఇక పుష్ప 2 జులై నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ ఎవ‌రితో సినిమా చేయనున్నాడు అనేది ప్ర‌క‌టించ‌లేదు కానీ.. కొంత మంది ద‌ర్శ‌కులు మాత్రం ఎప్ప‌టి నుంచో వెయిటింగ్ లో ఉన్నారు.

ఇంత‌కీ ఎవ‌రంటే.. ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను.. బ‌న్నీతో సినిమా చేయాల‌ని క‌థ రెడీ చేశారు. అయితే… బ‌న్నీ పుష్ప 2 సినిమా చేస్తుండడంతో బోయ‌పాటి రామ్ తో సినిమా చేస్తున్నారు. బ‌న్నీ ఎప్పుడు సినిమా చేద్దామంటే అప్పుడు చేయ‌డానికి బోయ‌పాటి రెడీ. అలాగే కొర‌టాల శివ కూడా బ‌న్నీతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. అలాగే కోలీవుడ్ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కూడా బ‌న్నీ కోసం ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ మ‌ధ్య బ‌న్నీ, మురుగుదాస్ మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి.

తాజా అప్ డేట్ ఏంటంటే… లైకా ప్రొడక్షన్స్ వారు బన్నీతో  ఒక ప్రాజెక్టును అనుకున్నారు. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు అట్లీని తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో మురుగదాస్ పేరు వినిపిస్తోంది. మురుగదాస్ పేరు సిఫార్స్ చేసింది బన్నీయేనని అంటున్నారు. అలాగే అట్లీ డిమాండ్ చేసిన పారితోషికం కారణంగా మేకర్స్ కూడా మురుగదాస్ ను రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. పుష్ప 2 త‌ర్వాత‌ బన్నీ తదుపరి సినిమా బోయపాటితో ఉంటుందో..?   లేక‌ మురుగదాస్ తో ఉంటుందో..? అనేది చూడాలి.

Also Read : లోకేశ్ కనగరాజ్ పై దృష్టిపెట్టిన బన్నీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *