Friday, September 20, 2024
HomeTrending NewsUSA: అమెరికాలో భారీ వర్షాలు... వందల సంఖ్యలో విమానాలు రద్దు

USA: అమెరికాలో భారీ వర్షాలు… వందల సంఖ్యలో విమానాలు రద్దు

అమెరికాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పశ్చిమ అమెరికాలో మండే ఎండలతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తూర్పు అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ రద్దయిన, ఆలస్యంగా నడుస్తున్న విమానాల్లో మెజారిటీ విమానాలు నార్త్‌ ఈస్ట్‌ రీజియన్‌కు చెందినవే ఉన్నాయి.

దేశవ్యాప్తంగా మొత్తం 2,600 విమానాలు రద్దయితే, అందులో నార్త్‌ ఈస్ట్‌ రీజియన్‌కు చెందిన 1,320 ఉన్నాయి. అందులో న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్‌ లిబర్టీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోనే 350 విమానాలు నిలిచిపోయాయి. కాగా, ఈ వర్షాల ప్రభావం ముఖ్యంగా జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, లా గార్డియన్‌ విమానాశ్రయాలపై అధికంగా ఉన్నది.

అమెరికా ఫ్లైట్‌ అవేర్‌ డాటా ప్రకారం.. జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో 318 విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. మరో 426 విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక లాగార్డియా విమానాశ్రయంలో 270 విమానాలు రద్దయ్యాయి. ఇంకో 292 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా బోస్టన్‌ లోగాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 259 విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. మరో 459 విమానాలు ఆలస్యంగా తిరుగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్