Saturday, January 18, 2025
Homeసినిమాఆయనతో ఒక్క ఫోటో చాలనుకుంటే....

ఆయనతో ఒక్క ఫోటో చాలనుకుంటే….

ఇండస్ట్రీలో భారీ, క్రేజీ సినిమాలకు డైలాగులు రాయాలంటే.. ఠక్కు న గుర్తుకువచ్చేది సాయిమాధవ్ బుర్రా. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు రాసిన ఈ స్టార్ రైటర్ ఇప్పుడు మరో క్రేజీ మూవీకి డైలాగ్స్ రాసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఇంతకీ ఏ సినిమాకి అంటారా..?  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీకి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది రామ్ చరణ్‌ కు 15వ సినిమా కాగా దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం.

ప్రస్తుతం రామ్ చరణ్‌ నటిస్తున్న ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చాలా వేగంగా జరుగుతోంది. ఇటీవలే దిల్ రాజు, రామ్ చరణ్ ఇద్దరూ చెన్నైకి వెళ్లి శంకర్ ని కలసి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఈ సినిమా కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. తాజాగా స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని బుర్రా సాయి మాధవ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. జెంటిల్ మెన్ చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. అలాంటిది ఆయన చిత్రానికి ఇప్పుడు మాటలు రాస్తున్నా. శంకర్ సర్ కి, దిల్ రాజు గారికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు థ్యాంక్స్ అని తెలియచేసి డైరెక్టర్ శంకర్ తో ఉన్న బుర్రా సాయి మాధవ్ ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్