Wednesday, May 8, 2024
Homeసినిమానాగశౌర్య మూవీ షూటింగ్ పునః ప్రారంభం

నాగశౌర్య మూవీ షూటింగ్ పునః ప్రారంభం

యంగ్ హీరో నాగశౌర్య, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్‌ పతాకం పై ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ తిరిగి మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోయిన్‌ గా షిర్లే సేతియా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా లొకేషన్‌ పోస్టర్‌లో నాగశౌర్య, షీర్లే, అనీష్‌కృష్ణ, ఉషా ముల్పూరి ఆనందంగా కనిపిస్తున్నారు.

శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ టైటిల్‌ త్వరలోనే ఖరారు కానుంది. ఈ చిత్రంలో సీనియర్‌ యాక్టర్‌ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. హాస్యనటులు ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్యల కామెడీ హీలేరియస్‌గా ఉండ‌బోతోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ ఛాయగ్రాహకులు.

నాగశౌర్య, షీర్లే సేతియా, రాధిక, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: అనీష్‌ కృష్ణ, ప్రొడ్యూసర్‌: ఉషా ముల్పూరి, సమర్పణ: శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి, బ్యానర్‌: ఐరా క్రియేషన్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: మహతి స్వరసాగర్‌, డీఓపీ: సాయిశ్రీరామ్‌, సహ నిర్మాత: బుజ్జి ఎడిటర్‌: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, డిజిటల్‌ హెడ్‌: ఎమ్‌ఎన్‌ఎస్‌ గౌతమ్‌.
.

RELATED ARTICLES

Most Popular

న్యూస్