Friday, June 12, 2026
Homeసినిమా'బుట్ట బొమ్మ' టీజర్ రిలీజ్

‘బుట్ట బొమ్మ’ టీజర్ రిలీజ్

సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి నిర్మిస్తున్న చిత్రం ‘బుట్ట బొమ్మ‘. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు  హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ‌వంశీ ఎస్‌. సాయి సౌజ‌న్య‌ నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ‘బుట్ట బొమ్మ’ ప్రచార చిత్రాన్ని యూనిట్ విడుదల చేసింది.

మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్… ఇంకోసారి చెయ్యాలంటే … ఇప్పుడు కాల్ కట్ చెయ్యాలి గా… మాటింటే  మనిషిని చూడాలనిపించాలి.. మాట్లాడుతుంటే పాట ఇంటున్నట్టుండాలి… వంటి పాత్రోచితంగా సాగే సంభాషణలు చిత్రం పై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. అరవై ఐదు క్షణాల పాటు సాగే ఈ వీడియో లో వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయి అని నమ్మకంగా చెప్పొచ్చు.

శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ…‘బుట్ట బొమ్మ‘ గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి.‘ప్రేమ’ లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు.. విడుదలైన ఈ వీడియోను చూస్తే ఆయన మాటలు నిజమనిపిస్తాయి. సంభాషణల రచయిత గా ‘ వరుడు కావలెను‘ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. సంభాషణల్లో తనదైన బాణీ పలికించటానికి ఆయన తపన స్పష్టమవుతుంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు దాదాపు గా పూర్తి కావస్తున్నాయి. చిత్రం విడుదల ఇతర వివరాలు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియచేస్తాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular