Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్BWF World Championships: సేన్, ప్రణయ్ ముందంజ- కిడాంబి ఔట్

BWF World Championships: సేన్, ప్రణయ్ ముందంజ- కిడాంబి ఔట్

డెన్మార్క్ లోని కోపెన్ హాగెన్ లో మొదలైన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2023లో తొలిరోజు భరత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ గెలుపొందగా, కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్ద్ లో సిక్కీ రెడ్డి, రోహన్ జోడీ పరాజయం పాలై నిష్క్రమించింది.

ప్రణయ్ 24-22; 21-10 తేడాతో ఫిన్లాండ్ ఆటగాడు కోలోనేన్ పై; లక్ష్య సేన్ 21-12;21-7 తేడాతో మారిషస్ ఆటగాడు జూలియన్ పాల్ పై విజయం సాధించారు.

కాగా శ్రీకాంత్ 14-21; 14-21 తేడాతో జపాన్ ఆటగాడు కెంటా నిశిమోతో చేతిలో పరాజయం పాలయ్యాడు.

మిక్స్డ్ డబుల్స్ లో రోహన్- సిక్కీలు స్కాట్లాండ్ జోడీ ఆడమ్ హాల్- జూలీ మాక్ పియర్సన్ చేతిలో 21-14; 20-22; 21-18 తేడాతో ఓడిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular