Tuesday, June 9, 2026
HomeTrending Newsమంత్రుల రాజీనామా

మంత్రుల రాజీనామా

Ministers Resigned: రాష్ట్ర కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పలు అంశాలతో పాటు రాజకీయ విషయాలను కూడా చర్చించారు. తర్వాత సిఎం జగన్ అభిమతం, సూచన మేరకు మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు.

మంత్రులు రాజీనామాలకు మానసికంగా సిద్ధమై కేబినేట్ భేటీకి హాజరయ్యారు. చాలా మంది మంత్రులు తమ సొంత వాహనాల్లోనే హాజరయ్యారు. మరోవైపు, మంత్రుల పేషీల్లో పని చేస్తున్న ఓఎస్డీలు, పిఎస్, అడిషనల్ పిఎస్, పీఆర్వోలు అందరినీ తమ సొంత శాఖలలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. మంత్రులు కూడా తమ ఛాంబర్లలో ఉన్న వస్తువులను తరలించేందుకు కూడా మంత్రులు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈనెల 11న సోమవారం ఉదయం 11.35 గంటలకు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. 10న ఆదివారం కొత్త మంత్రుల జాబితాను వెల్లడించి, వారికి సమాచారం అందించనున్నారు.

Also Read ఏప్రిల్11న కేబినెట్ ప్రక్షాళన? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular