Saturday, November 23, 2024
Homeజాతీయంభారత్ లో క్యాడ్బరీ శాకాహారమేనట!

భారత్ లో క్యాడ్బరీ శాకాహారమేనట!

క్యాడ్బరీ చాకొలెట్లు తెలియనివారుండరు. రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటన్లో పుట్టిన క్యాడ్బరీ ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడది రవి అస్తమించని క్యాడ్బరీ సామ్రాజ్యం. భూగోళంలో అతి పెద్ద ఆహార ఉత్పత్తుల కంపెనీల్లో క్యాడ్బరీది బహుశా రెండో స్థానం.

ఇంగ్లీషువాడు చేసిందేదయినా మనకు చాలా రుచిగా, హోదాగా అనిపిస్తుంది. క్యాడ్బరీ సరేసరి. అలాంటి క్యాడ్బరీకి భారత్ అతిపెద్ద మార్కెట్. దేశంలో అనేక చోట్ల క్యాడ్బరీ ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. క్యాడ్బరీలో ఏముంటాయి? ఆహారానికి మంచిదా? చెడ్డదా? అన్న విషయం ఇంకెప్పుడయినా మాట్లాడుకుందాం.

తాజాగా క్యాడ్బరీ చాకొలెట్లలో గొడ్డు మాంసం వాడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు తెగ వైరల్ అవుతోంది. పైగా గొడ్డు మాంసం వాడుతున్నట్లు క్యాడ్బరీనే అంగీకరించినట్లు ఒక స్క్రీన్ షాట్ దేశమంతా తిరుగుతోంది. జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి క్యాడ్బరీ ఇండియా వెంటనే ఒక వివరణ ఇచ్చుకుంది. గొడ్డు మాంసం వాడుతున్నట్లు ఒప్పుకున్న స్క్రీన్ షాట్ ఈ దేశానిది కాదని, భారత్ లో చాకొలెట్లలో ఎలాంటి మాంసం వాడడం లేదని, ఇక్కడ తయారయ్యేవి నూటికి నూరుపాళ్లు శాకాహార ఉత్పత్తులని చెప్పుకుంటోంది. నిజమే కావచ్చు. ఇంకేదో దేశంలో చాకొలెట్ల తయారీలో గొడ్డు మాంసం వాడుతున్నట్లు క్యాడ్బరీ స్పష్టంగా అంగీకరించింది. అనుమాన బీజం పడకూడదు. పడింది. ఈ వివాదం నుండి క్యాడ్బరీ ఎలా బయట పడుతుందో మరి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్