అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక బిల్లును తెచ్చారు. సమాజంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి, అట్టడుగు వర్గాలకు పటిష్ట రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సోమవారం సభ్యులు ఆమోదం తెలిపారు. గవర్నర గావిన్ న్యూసమ్ దీనిపై సంతకం చేస్తే చట్టంగా మారుతుంది.
బిల్లు ఆమోదంతో అమెరికాలో కుల వివక్ష వ్యతిరేకతపై చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. తొలుత ఈ బిల్లును స్టేట్ సీనియర్ సెనేటర్ అయిసా వాహబ్ ప్రవేశపెట్టగా, రాష్ట్రంలోని పౌర హక్కుల నేతలు, సంస్థలు మద్దతు తెలిపాయి.