Saturday, November 23, 2024
HomeTrending NewsUkraine: కాళీ మాతను అవమానించిన ఉక్రెయిన్‌

Ukraine: కాళీ మాతను అవమానించిన ఉక్రెయిన్‌

హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్‌ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్‌ తార మార్లిన్‌ మన్రోతో పోలుస్తారా? అంటూ మండిపడ్డారు. పెద్ద ఎత్తున భారతీయుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది ఉక్రెయిన్ రక్షణ విభాగం. అయితే, హిందువుల మనోభావాలను గాయపర్చి ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడంపై భారతీయులు మండిపడుతున్నారు.

హిందూ ఫోబియాతోనే ఉక్రెయిన్‌ ఈ దుశ్చర్యకు పాల్పడిందంటూ విమర్శించారు. యద్ధం కారణంగా జరిగిన భారీ పేలుడు, దాని వల్ల ఏర్పడిన పొగ, మంటను ఒక పక్క, అదే ఆకారంలో హిందువుల దేవత కాళీమాత బొమ్మను మార్ఫింగ్‌ చేసి పొగ స్థానంలో మెడలో పుర్రెలతో, ఆగ్రహంతో నాలుక చాపి ఉన్న ఆమె గౌన్‌ ధరించినట్టు, అది ఎగురుతున్నట్టు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీనిపై భారత్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. వెంటనే ఉక్రెయిన్‌ ప్రభుత్వం దీనికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘ఇటీవల ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి భారతదేశం నుంచి మద్దతును కోరుతూ ఢిల్లీలో ఉన్నారు. దీని వెనుక ఉక్రెయిన్ ప్రభుత్వ అసలు ముఖం దాగి ఉంది. భారతీయ దేవత మా కాళి ప్రచార పోస్టర్‌పై వ్యంగ్య చిత్రం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలపై దాడి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్