Saturday, January 18, 2025
HomeTrending Newsభారత్ రాకపోకలపై కెనడా ఆంక్షలు

భారత్ రాకపోకలపై కెనడా ఆంక్షలు

భారత్ నుంచి విమాన రాకపోకలపై కెనడా మరో నెల రోజుల పాటు నిషేధం విధించింది. ఏప్రిల్ 22 నుంచి మొదలైన విమానయాన నిషేధం రేపటితో ముగియనుండగా భారత్ లో కరోన కేసులు తగ్గే వరకు  నిషేధం తప్పదని కెనడా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇండియా లో డెల్టా వేరియంట్ ఉదృతి తగ్గే వరకు విమాన ప్రయాణాల్ని అనుమతించేది లేదని కెనడా తేల్చి చెప్పింది. దీంతో కెనడా వెళ్ళే భారతీయులు ఆగస్ట్ 21 వ తేది వరకు వేచి ఉండాల్సిందే. కెనడాలో పెద్ద సంఖ్యలో స్థిరపడ్డ సిక్కులు, గుజరాతీ కుటుంబాలు తమ వారిని కలుసుకోవటం కుదరక ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వస్తోంది.

మరోవైపు వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో తీసుకున్న అమెరికన్లు, యూరోప్ దేశాల ప్రయాణికులు రావొచ్చని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల తొమ్మిదో తేదీ నుంచి మొదటగా అమెరికన్లను అనుమతిస్తున్నారు.  అమెరికా పిఆర్(పర్మనెంట్ రెసిడెన్సీ ) ఉన్నవారిని అనుమతించి తదుపరి పరిస్థితులను సమీక్షించాక ఇతర దేశాల వారికి  కూడా పర్మిట్ ఇవ్వాలని కెనడా నిర్ణయించింది. సెప్టెంబర్ ఏడవ తేడు నుంచి అన్ని దేశాల వారిని అనుమతించాలని సూత్ర ప్రాయ నిర్ణయం తీసుకున్నారు. కెనడాకు వచ్చే 14 రోజుల ముందు వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయినవారికి ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతిస్తారు. సెప్టెంబర్ తర్వాత వచ్చే వారు వ్యాక్సిన్ తీసుకుంటే క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్