Sunday, September 8, 2024
HomeTrending Newsకెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

Varun Singh dies: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ నేడు మృతి చెందారు.  ఈ నెల 8 న తమిళనాడులోని కూనూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో మొత్తం 14 మంది ఆ హెలికాఫ్టర్ లో పయనిస్తున్నారు. ఈ విషాద ఘటనలో చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, అయన భార్య మధులిత తో పాటు 13 మంది అదేరోజు అసువులు బాశారు.  తీవ్ర గాయాల పాలైన వరుణ్ సింగ్ ను మొదట వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందించారు, అనతరం మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు లోని ఆర్మీ కమాండ్ ఆస్పత్రికి తరలించారు.

వారరోజులపాటు మృత్యువుతో పోరాడిన కెప్టెన్ వరుణ్ సింగ్ నేటి ఉదయం కన్నుమూశారు. వరుణ్ సింగ్ మరణవార్తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.

వరుణ్ సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. దేశానికి వరుణ్ సింగ్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.

Also Read : డిఫెన్స్ హెలికాఫ్టర్ ప్రమాదం: 11మంది మృతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్