Saturday, November 23, 2024
HomeTrending NewsTreetoons: ప్రకృతి ప్రేమికుడు కార్టూనిస్ట్ మృత్యుంజయ్

Treetoons: ప్రకృతి ప్రేమికుడు కార్టూనిస్ట్ మృత్యుంజయ్

ప్రముఖ కార్టూనిస్ట్ చిలువేరు మృత్యుంజయ్…చెట్ల పెంపకంపై అవగాహన కల్పించేందుకు ‘ట్రీటూన్స్’ (హరిత హాసం) పేరుతో గీసిన కార్టూన్‌ల ప్రదర్శన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది.

హైదరాబాద్‌ కు చెందిన మృత్యుంజయ్ గీసిన హరిత హాసం ప్రదర్శనను ప్రముఖ కళాకారుడు, విమర్శకుడు, రచయిత సురేష్ జయరామ్ ప్రారంభించారు. సావీ మిసెస్ ఇండియా ఫోటోజెనిక్ శ్రీమతి రేణుకా కుంభం గౌరవ అతిథిగా… గ్రీన్ ఇండియా సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్ర యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

చిలువేరు మృత్యుంజయ్ గీసిన కార్టూన్లు చెట్లు నరకవద్దు, మొక్కలు నాటడం అనే అంశంపై ఆలోచింపజేస్తున్నాయని, ఆయన గీసిన ప్రతి కార్టూన్‌ను టీ షర్టులు, హ్యాండ్ బ్యాగులపై ముద్రించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సురేష్ జయరామ్ అన్నారు.

రేణుకా కుంభం మాట్లాడుతూ, కళాకారుడు సృష్టించే చిత్రం ఎంతో పవిత్రంగా ఉంటుందన్నారు. చెట్లకు భావోద్వేగాలు ఉంటాయని, అవి మాట్లాడతాయని తాతయ్య కాపు రాజయ్య నుంచి చూశానన్నారు. మృత్యుంజయ్ కార్టూన్‌లు చూస్తే హరిత హాసం కనిపిస్తుంది. కార్టూన్లు నిజంగా ‘హరిత అద్భుతం’ అని రేణుకా కుంభం ప్రశంసించారు.

రాఘవేంద్ర యాదవ్ మాట్లాడుతూ మృత్యుంజయ్ గ్రీన్ ఇండియా కోసం ప్రత్యేకంగా మూడు వందల కార్టూన్లు గీశారని పేర్కొన్నారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ ప్రదర్శించడం గొప్ప విషయమని, ఈ అద్భుతమైన కార్టూన్లను భవిష్యత్ తరాలకు అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.

కార్టూన్లు గీయడానికి తన తండ్రి ప్రముఖ ఇక్కత్ కళాకారుడు దివంగత చిలువేరు రామలింగం స్ఫూర్తి అని చేనేత కుటుంబం నుంచి వచ్చిన మృత్యుంజయ్ చెప్పారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ రూపొందించిన గ్రీన్‌ ఇండియా ఈ ‘ట్రీటూన్స్‌’ కార్టూన్‌లను గీయడానికి ప్రేరణ పొందిందని, సాధారణ పొలిటికల్ కార్టూన్‌లకు పూర్తి భిన్నంగా ఈ కార్టూన్‌లు గీస్తున్నప్పుడు కొత్త ఆనందం నింపిందని ఆయన చెప్పారు. భారతీయ ఇంక్ నీరుతో పెన్సిల్స్ కార్టూన్ ఆకులను మొలకెత్తే మొక్కలు… ఇప్పుడు ఈ గ్యాలరీ 80 కార్టూన్‌లతో వికసిస్తోందని, గ్యాలరీలో కార్టూన్ మొక్కలను నాటడానికి నన్ను అనుమతించిన నరేంద్రకి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్