యూఎస్ ఓపెన్ -2022 పురుషుల సింగిల్స్ లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ – నార్వే ఆటగాడు కాస్పెర్ రూడ్ లు ఫైనల్స్ కు చేరుకున్నారు.
నేడు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ల్లో మూడో సీడ్ అల్కరాజ్ 6-7;6-3;6-1;6-7;6-3 తేడాతో అమెరికా ఆటగాడు ఫాన్సిస్ తియోఫో పై విజయం సాధించాడు. నాలుగు గంటల 19నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది.
మరో మ్యాచ్ లో ఐదో సీడ్ కాస్పెర్ రూడ్ 7-6;6-2; 5-7;6-2 తో రష్యా ఆటగాడు కారెన్ కచానోవ్ పై గెలుపొందాడు.
ఆదివారం అర్ధరాత్రి (సోమవారం వేకువజామున) అల్కరాజ్-రూడ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది.
Also Read : US Open: సెమీఫైనల్లో స్వియటెక్