Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Khiladi Mass song: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ‘ఖిలాడీ’ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు,హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ రోజు ఐదో పాట‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ‘క్యాచ్ మీ’ అంటూ సాగే ఈ పాటను ర‌వితేజ – డింపుల్ హయాతిల మీద చిత్రీక‌రించారు. ఈ పాటలో డింపుల్ లుక్స్‌, కిల్ల‌ర్ ప‌ర్స‌నాలిటి, క‌ట్టిప‌డేసే ఎక్స్‌ ప్రెష‌న్స్ ప్రేక్ష‌కుల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ పాటతో గ్లామర్ విందు ఇచ్చింది డింపుల్‌.

శ్రీ మ‌ణి సాహిత్యం, నేహా బాషిన్, జ‌స్ప్రీత్ జాస్జ్ గానం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రీలీజ్ చేసిన అన్ని పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్ పై తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా రవితేజ సరసన నటించారు.

సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఖిలాడీ ఫిబ్రవరి 11న తెలుగు మరియు హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com