Thursday, April 18, 2024
Homeసినిమాసంపూర్ణేష్ బాబు ‘క్యాలీఫ్లవర్‌’ 26న విడుదల

సంపూర్ణేష్ బాబు ‘క్యాలీఫ్లవర్‌’ 26న విడుదల

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు. ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాల పై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముజీర్‌ మాలిక్‌ ఛాయగ్రాహకుడు. ఎడిటింగ్‌ బాధ్యతలను బాబు నిర్వ హిస్తున్నారు.  సంపూర్ణేష్‌బాబు, వాసంతి జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిణి, కాదంబరి కిరణ్ త‌దిత‌రులు న‌టించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్