కరోనా అనిశ్చితి నేపథ్యంలో 2021- 22 విద్యా సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించడం కష్టమని సి బి ఎస్ ఈ భావిస్తోంది. 10, 12 తరగతులకు మొత్తం విద్యా సంవత్సరంలో రెండే సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్ చివర పరీక్షలు నామమాత్రంగా నిర్వహిస్తారు. సిలబస్ ను కూడా దాదాపు సగానికి సగం కుదించారు. పరీక్షలు, గ్రేడింగ్, ఉత్తీర్ణతకు కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారు. పరిస్థితులు అనుకూలిస్తే వ్యాసరూప ప్రశ్నలతో పరీక్షలు పెడతారు. లేదంటే ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు, ఇంటర్నల్, అసైన్ మెంట్ల ఆధారంగా ఉత్తీర్ణతను నిర్ణయిస్తారు.