Sunday, January 19, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ ఆంథమ్ వచ్చేస్తోంది

ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ ఆంథమ్ వచ్చేస్తోంది

Celebration Anthem: బాహుబ‌లి త‌ర్వాత‌ దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఈ సినిమా కోసం  అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇంత‌కు ముందు భారీ రేంజ్ లో ప్ర‌మోష‌న్స్ చేశారు. అయితే.. క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా విడుదల వాయిదా ప‌డ‌డంతో ప్ర‌మోష‌న్స్ కి బ్రేక్ ప‌డింది. ఇప్పుడు మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర‌ కావడంతో  మళ్ళీ ప్రచారం మొదలు పెట్టేశారు.ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాల్ని నెలకొల్పాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి సెలబ్రేషన్ ఆంథమ్ విడుదల చేయబోతున్నారు. కీరవాణి మాసీ ట్యూన్ తో మోతెక్కించనున్న ఈ పాట ఆర్ఆర్ఆర్ చిత్రానికే హైలైట్ కాబోతోంది. ఈ నెల 14న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ‘ఎత్తర జెండా’ అనే ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. తారక్, చర‌ణ్‌, ఆలియా డ్యాన్సింగ్ మోడ్ తో రివీలైన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్