Sunday, May 19, 2024
HomeTrending Newsఅప్పులపై టిడిపిది విష ప్రచారం: సిఎం జగన్

అప్పులపై టిడిపిది విష ప్రచారం: సిఎం జగన్

for Welfare only: అప్పుల విషయంలో తమ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన సిఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడిన ముఖ్యాంశాలు:

⦿ 2014 నాటికి రాష్ట్రానికి రూ.1,20,556 కోట్ల అప్పులు ఉంటే, 5 ఏళ్లలో అవి రూ.2,68,225 కోట్లకు చేరుకున్నాయి.
⦿ అవే కాకుండా ప్రభుత్వ గ్యారెంటీ మీద 2014 నాటికి చేసిన అప్పులు రూ.14,028 కోట్లు , చంద్రబాబు హయాంలో 2019 నాటికి మరో రూ.58 వేల కోట్లకు చేరాయి.
⦿ గత ప్రభుత్వం దాదాపు రూ.39 వేల కోట్ల బాకీలు చెల్లించకుండా వదిలేసింది.
⦿ విద్యుత్‌ పంపిణీ సంస్థల బకాయిలు 2014 నాటికి రూ.2893 కోట్లు ఉంటే, అవి 2019 నాటికి రూ.21,540 కోట్లకు పెరిగాయి. అంటే విద్యుత్‌ కొనుగోలు చేసి వారికీ చంద్రబాబు ఎగ్గొట్టారు.
⦿ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు సంబంధించి 2014 నాటికి రూ.20,703 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.68,596 కోట్లకు పెరిగాయి.
⦿ దీన్ని ఆర్థిక వ్యవస్థ అంటారా? లేక ఆర్థిక అరాచకం అంటారా? అనేది ఎల్లో మీడియాకే తెలియాలి
⦿ రాష్ట్రం మీద ఇంత భారం మోపి ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు.
⦿ అంతా అవినీతికి పోయింది. అదే మనం చేసిన అప్పు ప్రజల జేబుల్లోకి పోయింది.
⦿ టీడీపీ హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి, జీఎస్డీపీ పరిమితి 3 శాతానికి మించి ఏటా అప్పులు చేశారు.
⦿ ఆ మేరకు 2014–15లో 3.95 శాతం, 2015–16లో 3.65 శాతం, 2016–17లో 4.52 శాతం,
⦿ 2017–18లో 4.12 శాతం, 2018–19లో 4.07 శాతం అప్పులు ఎక్కువగా చేశారు.
⦿ ఇలా ఎక్కువ అప్పులు చేయడం వల్ల ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులో రూ.16,419 కోట్ల కోత పెట్టారు.
⦿ దానిపై కేంద్రంతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఆ విధంగా చంద్రబాబు చేసిన పాపాలు మనల్ని వెంటాడుతున్నాయి.
⦿ బాబుగారి హయాంలో ప్రతి ఏటా అప్పులు, కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ (సీఏజీఆర్‌) 17.33 శాతం చొప్పున పెరిగినా ఎల్లో మీడియాకు కనిపించదు
⦿ మనం ఆ అప్పు కడుతున్నాం. మన హయాంలో పెరిగిన అప్పు 14.88 శాతం మాత్రమే.
⦿ పాపాలు చంద్రబాబువి. ప్రాయశ్చితం మనది.
⦿ అయినా ఈ నిజాన్ని దాచి, మన ప్రభుత్వం మీద నిందలు వేస్తున్న వారిది జర్నలిజమ్‌ అంటారా.
⦿ మరోవైపు చేతకాని వాడికి కోపం ఎక్కువ అన్నట్లు రోజుకు జూమ్‌ మీటింగ్‌. నాలుగు ప్రెస్‌మీట్లు. తిట్టించడం. ఎల్లో మీడియాలో జోరుగా ప్రచారం.
⦿ చంద్రబాబు, ఆయన పార్టీ ప్రజలకు చేసిన మేలు ఏమిటి? దీన్ని అందరూ ఆలోచించాలి.

“తమకు అధికారం పోయి 1000 రోజులు అయిన సందర్భంగా రగిలిపోతున్న చంద్రబాబునాయుడు గారి పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు, ఎల్లో మీడియా వారికి, వేర్వేరు సంస్థల్లో చంద్రబాబు బాగు కోసం అహర్నిశలూ కష్టపడుతున్న వారికి, ట్యామ్‌ ఫార్టీ ట్యాబ్లెట్లు, జెలుసిల్‌ సిరప్, ఈనో ప్యాకెట్లు విరివిగా లభించాలని కోరుకుంటూ.. ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడి దయ మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను” .. అని సిఎం జగన్ వ్యాఖ్యానించారు.

Also Read : అశుభంతో పాలన మొదలైంది: అచ్చెన్న

RELATED ARTICLES

Most Popular

న్యూస్