Saturday, July 27, 2024
HomeTrending Newsఅశుభంతో పాలన మొదలైంది: అచ్చెన్న

అశుభంతో పాలన మొదలైంది: అచ్చెన్న

Charge Sheet: సిఎం జగన్ వెయ్యి రోజుల పాలనలో నేరాలు-ఘోరాలు, లూటీలు అసత్యాలు మాత్రమే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  జగన్ పరిపాలన ఒక అశుభంతో  మొదలయ్యిందని, ప్రజావేదిక కూల్చివేతతోనే ఈ ప్రభుత్వం విధ్వంస పాలనకు తెర తీసిందని ఆరోపించారు. ఐదుకోట్ల ప్రజలు, మేధావులు, నాడు సభలో ఉన్న అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రాజధానిగా అమరావతిని  నిర్ణయించామని గుర్తు చేశారు. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితుల్లో ప్రభుత్వంపై భారం పడకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించామన్నారు.  రాష్ట్రంలో సిఎం జగన్ పరిపాలన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంలో ‘జగన్ వెయ్యి రోజుల విధ్వంస పాలనలో 1000 నేరాలు- ఘోరాలు, లూటీలు, అసత్యాలు’ పేరుతో ప్రజా ఛార్జ్ షీట్ ను అచ్చెన్నాయుడు పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ … అమరావతి పేరు ఉన్నంత వరకూ చంద్రబాబు పేరు అజరామరంగా ఉంటుందన్న దుగ్ధతోనే దీన్ని నాశనం చేయాలని మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 226  ఆలయాలపై దాడులు జరిగాయన్నారు.

అచ్చెన్నాయుడు ప్రస్తావించిన ముఖ్యాంశాలు…

  • రాష్ట్రంలో ఏనాడైనా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందా?
  • ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే దాడికి వెళ్ళడం ఎప్పుడైనా జరిగిందా?
  • ముఖ్యమంత్రి ఇంటికోసం తాడేపల్లి లోని పేదల ఇళ్లు కూల్చేశారు.
  • రాష్ట్రంలో ఇసుక దోచుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు
  • సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై పోలీసులతో దాడి చేయించారు.
  • పింక్ డిమాండ్ పై అవాస్తవాలు ప్రచారం చేసి, చంద్రబాబుపై ఆరోపణలు చేశారు
  • డిఎస్పీల నియామకంపై కూడా అసత్యాలు  ప్రచారం చేశారు
  • అగ్రి గోల్డ్ హాయ్ లాండ్ లోకేష్ కొన్నారని దుష్ప్రచారం చేశారు
  • విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పటికి పది సార్లు పెంచారు.
  • ఇసుక, మద్యం విషయంలోనూ మాట తప్పారు
  • గవర్నర్ కు తెలియకుండా అయన పేరుమీదే అప్పు తెచ్చారు
  • ఏపీపిఎస్సీ చైర్మన్ ను అవమాన పరిచారు
  • ఎన్నికల సంఘం కమిషనర్ ను అన్యాయంగా తొలగించారు.
  • అప్పులు విపరీతంగా తీసుకు వస్తున్నారు

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సిఎం చిన రాజప్ప, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, పరుచూరి అశోక్ బాబు కూడా పాల్గొన్నారు.

Also Read : 160 సీట్లు ఖాయం : అచ్చెన్నాయుడు ధీమా

RELATED ARTICLES

Most Popular

న్యూస్