Thursday, April 25, 2024
HomeTrending Newsబీజేపీ తెలంగాణ పాలిట శత్రువే - మంత్రి వేముల

బీజేపీ తెలంగాణ పాలిట శత్రువే – మంత్రి వేముల

ఉద్యోగాల కోసం మిలియన్ మార్చ్ చేస్తానన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ మిలియన్ మార్చ్ ముందు మోడీ దగ్గర చేసి తెలంగాణలో చేయాలన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బిజెపి ఉద్యోగకల్పన పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఇచ్చినన్ని ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో లక్ష 32వేల ఉద్యోగాలు ఇచ్చామని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చినట్లు నిరూపిస్తావా అని బండి సంజయ్ కు సవాల్ విసిరారు. తన మంత్రి పదవి రాజీనామాకు కట్టుబడి ఉన్నానని దీనిపై స్పందించాలని బండి సంజయ్ ను డిమాండ్ చేశారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మోతె కప్పల వాగు పై 12 కోట్ల వ్యయం తో నిర్మించే హై లెవల్ బ్రిడ్జ్,మోర్తాడ్ తక్కురివాడ పాయింట్ వద్ద పెద్దవాగు పై 9.5 కోట్ల వ్యయంతో నిర్మించే చెక్ డ్యామ్,వడ్యాట్ గ్రామంలో మోర్తాడ్ ౼ వడ్యాట్ R&B రోడ్ 1.5 కోట్లతో పునరుద్ధరణ పనులకు, కమ్మర్పల్లి వద్ద వడ్యాట్ ౼ కమ్మర్పల్లి రోడ్ (పి.ఆర్) 87 లక్షలతో రోడ్డు పునరుద్ధరణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.

మంత్రి కేటిఆర్ 17వేల సంస్థలు రాష్ట్రానికి తీసుకు వచ్చాడని, దీనివల్ల 16 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించబడ్డాయని తెలిపారు. బిజెపి పాలిత గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్,కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించారో చూపించాలన్నారు. దీనిపై కూడా చర్చకు రావాలని మంత్రి సవాల్ చేశారు.నిజామాబాద్ ఎంపి అర్వింద్ పసుపుబోర్డు పేరుతో రైతులను మోసం చేసాడని,మద్దతు ధర ఇప్పిస్తానని మూడేళ్ళుగా తప్పించుకు తిరుగుతున్నాడని అందుకే రైతులు తిరగబడుతున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడుతుందని, బిజెపిని తెలంగాణ పాలిట శత్రువుగానే పరిగణిస్తామన్నారు. రైతులు, ప్రజలు,మేధావులు కేంద్రంలోని బీజేపీ తెలంగాణపై చూపుతున్న వివక్ష పై ఆలోచన చేయాలన్నారు. బిజెపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే టిఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊర్కోరని బిజెపి నేతలను మంత్రి హెచ్చరించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్