Friday, February 7, 2025
HomeTrending Newsఏడు దశల్లో సాధారణ ఎన్నికలు- తెలుగు రాష్ట్రాలో మే 13న

ఏడు దశల్లో సాధారణ ఎన్నికలు- తెలుగు రాష్ట్రాలో మే 13న

లోక్ సభ సాధారణ ఎన్నికలకు గతంలో మాదిరిగా ఈసారి కూడా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం 2024 సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది

  • తొలిదశ ఏప్రిల్ 19
  • రెండవ దశ ఏప్రిల్ 26
  • మూడవ దశ మే 7
  • నాలుగో దశ మే 13
  • ఐదవ దశ మే 20
  • ఆరవ దశ మే 25
  • చివరి దశ జూన్ 1న పోలింగ్ జరగనుంది

దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్ తో పాటు సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో మే 13న జరగనున్నాయి.

సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఒకే దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.

కాగా ఒడిస్సా అసెంబ్లీకి నాలుగు దశల్లో (లోక్ సభ ఎన్నికల 4,5,6,7 దశల్లో) పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణ లో కూడా మే 13 న లోక్ సభ పోలింగ్  ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ లో… ఎమ్మెల్యే గడ్డం లాస్య నందిత మృతితో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా మే 13 న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

కోటి 55 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని, 55 లక్షల ఈవీఎం లు వినియోగిస్తామని, 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాల్లో  పోలింగ్ ఉంటుందని, మొత్తం 97 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని, వీరిలో కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు తొలిసారి ఓటు వేయబోతున్నారని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ వివరించారు. పార్లమెంట్ అభ్యర్థులు రూ.90 లక్షల వరకు,  అసెంబ్లీకి పోటీ చేసే వారు రూ.38 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్