Wednesday, March 18, 2026
HomeTrending Newsరాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాలను కేంద్రం ఈ రోజు (గురువారం) అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక ఉన్నాయి. మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. టెస్ట్-ట్రాక్, ట్రీట్-వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అనుసరించాలని కోరింది.

నాలుగు నెలల తర్వాత భారత్‌లో అత్యధిక సంఖ్యలో కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి. గతేడాది నవంబర్‌లో 734 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసులు ఆ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారితో కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్​ కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి చేరింది. దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular