అత్యుద్భుతంగా కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటోంది. లోక్‌సభ, రాజ్యసభ హాల్స్‌కు చెందిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. లోక్‌సభలో 888 మంది సభ్యులు కూర్చునే రీతిలో నిర్మించారు. లోటస్ థీమ్ తరహాలో రాజ్యసభను డిజైన్ చేశారు.
సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది. అత్యంత విశాలమైన హాల్స్, లైబ్రరీతో పాటు పార్కింగ్‌కు కావాల్సినంత స్థలాన్ని కల్పిస్తున్నారు. హాల్స్, ఆఫీసు రూములన్నీ ఆధునిక టెక్నాలజీకి తగ్గట్టు నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనంలో 888 సీట్ల కెపాసిటీతో లోక్‌సభ హాల్‌ను నిర్మించారు.
ఇక రాజ్యసభ హాల్‌ను లోటస్ థీమ్ తరహాలో నిర్మించారు. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే రీతిలో దీన్ని కట్టారు.