ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈనెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ తో పాటూ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరొకరు చొప్పున సభ్యులు ఉంటారు.
కమిటీలో సభ్యులుగా ఏపీ నుంచి ఎస్.ఎస్.రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈనెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ప్రతి నెల సమావేశం కావాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రధానంగా ప్రత్యేక హోదా, పన్ను అంశాల్లో సవరణలు, వనరుల వ్యత్యాసం, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన.. తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
Also Read : ఏపి పునర్విభజనపై ప్రధాని కీలక వ్యాఖ్యలు