Saturday, January 18, 2025
Homeసినిమానాగ‌చైత‌న్య స‌రికొత్త రికార్డ్.

నాగ‌చైత‌న్య స‌రికొత్త రికార్డ్.

Chaitu-Insta:  అక్కినేని నాగచైతన్య ‘జోష్’ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే న‌టుడుగా మంచి మార్కులు సంపాదించాడు. అయితే.. ఆ త‌ర్వాత‌ “ఏ మాయ చేసావే’ మూవీతో క‌మ‌ర్షియ‌ల్ సక్సెస్ సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు.

ఈ మూవీ తర్వాత చైతూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే.. మాస్ ప్ర‌య‌త్నం చేసిన ప్ర‌తిసారీ ఫెయిల్ అయ్యాడు. ఈమ‌ధ్య ‘మ‌జిలీ’, ‘వెంకీమామ‌’, ‘బంగార్రాజు’ ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించి కెరీర్ లో దూసుకెళుతున్నాడు.

మరో వైపు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఇటీవలే ‘థ్యాంక్యూ‘ షూటింగ్ పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరో వైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్నాడు చైత‌న్య‌. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తూ ఫాలోవర్లను అంట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఇన్‏స్టాలో మరో మైలురాయిని దాటాడు.

ఈ యంగ్ హీరో నాగచైతన్య తన ఇన్‏స్టా ఖాతాలో 7 మిలియన్స్ పైగా ఫాలోవర్లను రీచ్ అయ్యాడు. దీంతో చైతూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేస్తున్నారు. ఈ స‌మ్మ‌ర్ లో థ్యాంక్యూ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Also Read : నాని డైరెక్ట‌ర్ తో నాగ‌చైత‌న్య‌?  

RELATED ARTICLES

Most Popular

న్యూస్