నాగ చైతన్య మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

అక్కినేని నాగచైతన్య ఓ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాకి చందు మొండేటి డైరెక్టర్. గీతా ఆర్ట్స్ఈ చిత్రాన్నిఅత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందే కథ. అందుకనే ఈ కథ గురించి మరింతగా తెలుసుకోవడం కోసం ఈ మూవీ టీమ్ శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారులను కలవడం జరిగింది.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఎప్పటి నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజా వార్త ఏంటంటే.. సెప్టెంబర్ లేదా అక్టోబర్  నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ఇక హీరోయిన్ ఎవంటే.. కీర్తి సురేష్ ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా కీర్తి ఈ సినిమాలో నటించేదుకు సైన్ చేసిందని సమాచారం. చైతన్య, కీర్తి సురేష్ కలిసి మహానటి సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో జంటగా నటిస్తుండడం విశేషం. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని చైతన్య పట్టుదలగా ఉన్నారు.

అలాగే కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన చందు మొండేటి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధించాలి అనుకుంటున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో చైతన్య ఫిషర్ మేన్ గా నటిస్తున్నాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. రెహమాన్ పేరు వినిపించింది కానీ.. అనిరుథ్ రవిచంద్రన్ ను ఫైనల్ చేశారని సమాచారం. వచ్చే సమ్మర్ లో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరి.. చైతన్య బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *