Friday, April 19, 2024
HomeTrending Newsపోరాడదాం...కలిసిరండి: బాబు పిలుపు

పోరాడదాం…కలిసిరండి: బాబు పిలుపు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును సిబిఐకి అప్పగించాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, హోం శాఖా మంత్రులను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. టిడిపి ఆఫీసుపై దాడిని నిరసిస్తూ 36 గంటలపాటు చేసిన ‘ప్రభుత్వ ఉగ్రవాద దీక్ష’ ముగింపు సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం ఇచ్చారు. ఈ పోరాటం తనకోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, ప్రజలంతా తమ పోరాటానికి  మద్దతివ్వాలని, కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర ప్రదేశ్ కోసం తాము పోరాటం చేస్తామని, ‘ మా బాధ్యత మేము చేస్తాం, మీ సహకారం మీరు ఇవ్వండి’ అంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంపై అందరం కలిసి పోరాటం చేద్దామని, తమతో కలిసి ముందుకు రావాలని ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఎన్జీవోలు, మేధావులు, రైతులు, కూలీలు, మహిళలను బాబు కోరారు.

చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు:

⦿ దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై వైసీపీ చేసింది ఉగ్రవాద దాడి
⦿ జగన్ దుష్ట పరిపాలన ప్రజలందరికీ అర్ధం కావాలి
⦿ డీజీపీ ఆఫీస్, సీఎం ఇల్లు, బెటాలియన్ దగ్గర్లోనే ఉన్నాయి
⦿ అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయారు
⦿ ఏపీ నుంచే వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోంది.
⦿ హెరాయిన్ డంప్ పట్టుకున్నారు.. దీనికి ఏపీకి లింకులున్నాయి.
⦿ ఇంతటి పెద్ద ఎత్తున మత్తు మందులు సరఫరా జరుగుతోంటే ప్రభుత్వం అలెర్ట్ కావద్దా..?
⦿ పార్టీ నేతలపై దాడులు జరిగితే సహించాం.. కానీ డ్రగ్స్ వల్ల పిల్లల భవిష్యత్ పాడవుతోంది.
⦿ అందుకే డ్రగ్స్ పై టీడీపీ పోరాటం.
⦿ దీనికి ప్రజల నుంచి సహకారం వచ్చింది కానీ.. ప్రభుత్వంలో చలనం లేదు
⦿ సీఎంకు భయపడి అందరూ సరెండర్ అవ్వాలా..?


⦿ ఇంత మంది సీఎంలు వచ్చారు.. ఏ సీఎం అయినా మద్యం వ్యాపారం చేయడానికి సాహసించారా..?
⦿ దొంగ సారా వ్యాపారంతో డబ్బులు గుంజుతున్నారు.
⦿ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టు పెట్టారు.
⦿ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఆడబిడ్డల తాళిబొట్లని తాకట్టు పెట్టారు.
⦿ మద్యపానం నిషేధం పేరుతో రేట్లు పెంచేశారు.
⦿ మద్యం ధరలు పెంచితే మద్యపానం తగ్గుతుందా..?
⦿ పక్క రాష్ట్రానికి పోయి మద్యం తెస్తున్నారు.. శానిటైజర్లు తాగేస్తున్నారు.
⦿ మద్యం ధరలు పెరగడం వల్ల తక్కువ ధరకు లభించే గంజాయికి అలవాటు పడుతున్నారు.
⦿ డ్రగ్స్.. గంజాయి గురించి ఆనందబాబు మాట్లాడితే నోటీసులిచ్చారు.
⦿ డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు సీఎం జగనుకు సమీక్ష జరిపే సమయం కూడా లేదా..?
⦿ మేం ఆధారాలిస్తాం.. పోలీసులు చొక్కాలిప్పేయండి.. ఆ ఇన్వేస్టిగేషన్ మేమే చేస్తాం
⦿ స్థానిక ఎన్నికల్లో టిడిపి కార్యకర్తలను నామినేషన్ కూడా వేయనీయలేదు
⦿ అక్రమాలు, బెదిరింపులకు పాల్పడుతూ ఎన్నికల్లో గెలుస్తున్నారు
⦿ భారీ మెజార్టీ అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు
⦿ ఇలాంటి దాడులతో ప్రభుత్వంపై  మా పోరాటం ఆపే  ప్రసక్తే లేదు
⦿ రాష్ట్ర భవిష్యత్ కోసం రెట్టించిన ఉత్సాహంతో పోరాడతాం

తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళు వంగలపూడి అనిత, పీతల సుజాత, గౌతు శిరీష, గుమ్మడి సంధ్యారాణి, పంచుమర్తి అనురాధ తదితరులు చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్