ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న నదీ జలాల హక్కులను తాకట్టు పెట్టవద్దని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్రంలో రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అయన ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక 7,500 మాత్రమే ఇస్తున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని చంద్రబాబు చెప్పారు. గ్రామీణ రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, వెంటనే రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.