పిడికెడు పెత్తందార్ల కోసమే అమరావతి ఉద్యమం నడుస్తోందని, తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు కట్టని, ఎవరూ కట్టలేని రాజధాని అమరావతి గురించి వెయ్యిరోజులుగా ఈ ఉద్యమం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతాల మనోభావాలు దెబ్బతీస్తూ, వారిని రెచ్చగొడుతూ ఓ కృత్రిమ ఉద్యమం నడుపుతున్నారని ధ్వజమెత్తారు. పెత్తందార్లు సొంత అభివృద్ధి కోసమే ఈ అందోళన చేస్తున్నారన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నాడు బాబు హయంలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. పరిపాలనా వికేంద్రీకరణపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సిఎం జగన్ పాల్గొన్నారు.
అమరావతి నుంచి అసరవిల్లికి పాదయాత్ర చేస్తున్నారని, అక్కడకు వెళ్లి ఆ దేవుణ్ణి ఏమని కోరతారని…. ఈ ప్రాంతం అభివృద్ధి జరగవద్దు మొత్తం అభివృద్ధి అంతా మా ప్రాంతంలోనే జరగాలంటూ అక్కడకు వెళ్లి దేవుణ్ణి ప్రార్దిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో భావోద్వేగాలు ఉన్నప్పుడు ఇలాంటి యాత్ర చేపడ్డడం భావ్యమేనా అని నిలదీశారు. ఈ ఉద్యమానికి బాబుకు ఆజ్యం పోస్తున్నారని, అందుకే వారు నారా హమారా – అమరావతి హమారా అంటూ బయల్దేరారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న సీట్లు కూడా రావని, అందుకే చంద్రబాబు ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ… పెట్రోలు డీజిల్ పోసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయతిస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
ఏ రంగమైనా నేను, నా మనుషులు మాత్రమే ఉండాలన్న పెత్తందారీ మనస్తత్వంతో కూడిన వారున్నారు
రాజధాని విషయంలో కూడా అదే జరిగింది
వారే ఇప్పుడు ఒకటే రాజధానిగా అమరావతి అనే నినాదం ఎత్తుకున్నారు
అమరావతి ప్రాంతంపై నాకు ఎలాంటి కోపం లేదు
ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆలోచనే నాకుంది
అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే లక్షా పదివేల కోట్ల రూపాయలు అవసరమని చంద్రబాబు ఇచ్చిన లెక్కలే చెబుతున్నాయి
చంద్రబాబు ఇంతగా అమరావతి కోసం ఎందుకు పాకులాడుతున్నారో అర్ధం కావడం లేదు
గ్రాఫిక్స్ చూపించి భ్రమలు కల్పించినందుకు 420కేసు పెట్టాలి
అమరావతిపై బాబు తన పదవీ కాలంలో 5,674 కోట్లు ఖర్చు పెట్టారు
మరో 2,297కోట్లు బాకీ పెట్టి వెళ్ళారు.
రాష్ట్రంలో ఇప్పటికీ 80శాతం మంది తెల్ల రేషన్ కార్డు మీదనే జీవనం సాగిస్తున్నారు
అలాంటిది రాజధానిపై లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సాధ్యమా?
అమరావతిలో రాజధాని తీసేయాలనే ఆలోచన లేదు
విశాఖ, కర్నూలు తో పాటు, అమరావతి కూడా ఓ రాజధానిగా ఉంటుంది
రాష్ట్రం అంటే కేవలం 8 కిలో మీటర్ల పరిధిలో ఉండే ప్రాంతం కాదు
రాజధాని అంటే 3.96 కోట్ల ఎకరాల విశాల భూభాగం
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెబుతారు
3254 ఎకరాలు ఆర్ధిక కార్యకలాపాల కోసం ఉంటుందని, 5,020 ఎకరాలు మాత్రమే కమర్షియల్ స్పేస్ కోసం ఉంటుందని స్వయంగా బాబు ప్రభుత్వం జీవో ఇచ్చింది
ఈ ఐదువేల ఎకరాలు ఎకరా 20కోట్ల రూపాయలకు అమ్మితే అప్పుడు లక్ష కోట్లు వస్తాయి
ఇక్కడ ఎకరా 10 కోట్లు కూడా లేదు, ఈ విషయంలో కూడా విభిన్న కథనాలు ఎల్లో మీడియాలో రాస్తుంటారు
ఇంత డబ్బు ఎలా సమీకరించాలో చెప్పరు
రైతులు అంటే 35వేల ఎకరాలు ఇచ్చిన వారే కాదు
మరో 50లక్షల ఎకరాల రైతులు కూడా ఉన్నారు
విశాఖపట్నం రాష్ట్రంలో అతి పెద్ద నగరం
దశాబ్దాలుగా విశాఖ నగరం ఎఅభివృద్ధి చెందుతూ వస్తోంది
బాబు చేయని దాన్ని, ఎవరూ చేయలేని దాన్ని మేము చేయాలని ఉద్యమం చేస్తున్నారు
చంద్రబాబు విజయవాడను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు
ఐదేళ్ళ పాటు చంద్రబాబు కనీసం కరకట్ట రోడ్డు కూడా విస్తరించలేకపోయారు.
పరిపాలనా వికేంద్రీకరణ ఒక అవసరం
ఇటీవలే వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయ కాంప్లెక్స్ ను ప్రారంభించాం
అక్కడ డిజిటల్ లైబ్రరీ లో దాదాపు 30మంది ఐటి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసుకుంటున్నారు
సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ఉండడం వల్లే ఇటీవలి వరదల్లో సహాయ కార్యక్రమాలను వెంటనే చేపట్టగాలిగాం
వాలంటీర్లు అద్భుతమైన సేవలు అందించారు.
తాము మంచి చేస్తున్నాం కాబట్టే ప్రతి ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు
ప్రజలందరి చల్లని దీవెనలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా
Also Read: కృష్ణం రాజు మృతికి సిఎం జగన్ సంతాపం