Chandrababu Naidu Tour In His Own Constituency Kuppam :
ఆంధ్ర ప్రదేశ్ ను తాము అభివృద్ధికి మారుపేరుగా నిలిపితే జగన్ ప్రభుత్వం సారాయి, గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా తయారు చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అవేదన వ్యక్తం చేశారు. హెరాయిన్ కు విజయవాడ కేంద్రంగా మారిపోయిందని, డ్రగ్స్ పై ప్రభుత్వాన్ని ప్రశిస్తే దాడులకు తెగబడుతోందని అన్నారు. తాను చేసేది ధర్మ పోరాటమని, ప్రజా దేవుళ్ళే తనను కాపాడుకుంటారని వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. టిడిపి 70 లక్షల మంది సుశిక్షుతులైన కార్యకర్తలు ఉన్న పార్టీ అని, ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడితే లొంగిపోయే సమస్యే లేదని, ప్రజా సమస్యలపై పారిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల పక్షాన పోరాడుతున్నామని, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు.
చంద్రబాబు మాట్లాడిన ముఖ్యాంశాలు:
రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది
వైసీపీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు
కనీసం పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి
ఇంటి పన్నును పదిరెట్లు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు
రాష్ట్ర కేబినేట్ లో బూతులు మాట్లాడేవారు, బెట్టింగ్ లు చేసేవారు ఉన్నారు
ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవారు కూడా నన్ను విమర్శిస్తున్నారు
టిడిపి ఆఫీస్ పై దాడి చేసి మా నేతలపైనే కేసులు పెట్టారు
నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు
ప్రజలకు షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలు పెంచారు
కొందరు అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
మేము అధికారంలోగి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం
కుప్పంను పులివెందుల చేయాలనుకుంటున్నారు
అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారు
నేను పులివెందులకు తాగు, సాగు నీరు ఇచ్చాను, మీరు కుప్పం కు ఎందుకు నీళ్ళు ఇవ్వడం లేదు?
Must Read :రేషన్ డీలర్ల ఆందోళనకు టిడిపి మద్దతు