Friday, April 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రెండేళ్లలో 20 ఏళ్ళు వెనక్కి : చంద్రబాబు

రెండేళ్లలో 20 ఏళ్ళు వెనక్కి : చంద్రబాబు

రెండేళ్ళ జగన్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా పడిపోయిందని తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందని అన్నారు. పారిశ్రామిక రంగం కుదేలైపోయిందని, రాష్ట్ర భవిష్యత్ ఆగమ్యగోచరంగా కనిపిస్తోందని వాపోయారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు, మహానాడు వేడుకలను  న్యూజిలాండ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు నిర్వహించారు. ఈ వేడుకలను ఉద్దేశించి వర్చువల్ గా చంద్రబాబు మాట్లాడారు.

జగన్ మోహన్ రెడ్డి ‘విద్వంసక’ రాజకీయాలు చేసున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు రెండేళ్ళ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కుపోయిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో విసుగెత్తిన పెట్టుబడిదారులు ఆంధ్ర ప్రదేశ్ అంటే భయపడి పారిపోయే పరిస్థితి నెలకొని ఉందని చంద్రబాబు  అన్నారు.  తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసిన అమరావతి, పోలవరం నిర్మాణం, భవన నిర్మాణ రంగాలను జగన్ ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యం కొరవడి ఆర్ధికంగా రాష్ట్రం కుదేలవుతోందని చంద్రబాబు అన్నారు.

రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం 25 దాటితే ఆర్ధిక రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నట్లు అవుతుందని, కానీ ఈ ప్రభుత్వ హయాంలో అది 36 శాతానికి చేరుకుందని విస్మయం వెలిబుచ్చారు.  అమరావతి లాంటి ఓ అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం ఎంతో కష్టపడితే కానీ సాధ్యమని, కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్