Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సంక్షేమానికి బాబు అడ్డు: సీదిరి

సంక్షేమానికి బాబు అడ్డు: సీదిరి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు అడగడుగునా అడ్డుకుంటున్నారని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేసి సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇళ్ళ పట్టాల లబ్ధిదారులకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్ళకు జగన్ భయపడరని అప్పలరాజు అన్నారు. ప్రజా కోర్టులో ఓడిపోయిన చంద్రబాబు ఏ కోర్టుకెక్కినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.

ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన నీటినే తాము వాడుకుంటున్నామని, ఆ కేటాయింపులకు లోబడే తాము ప్రాజెక్టులు నిర్నయిస్తున్నామని మంత్రి అప్పల రాజు వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టులకు వెళ్ళడం దారుణమన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్