Monday, June 3, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జూలై 7న జనసేన సమావేశం

జూలై 7న జనసేన సమావేశం

మూడు నెలల విరామం అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజక్షేత్రంలోకి రానున్నారు.  ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలండర్ ను నిరసిస్తూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు జనసేన అండగా నిలవనుంది. యువత సమస్యలపై పోరాటానికి  కార్యాచరణ రూపొందించనున్నారు.

రేపు సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకి చేరుకొని, 7న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ బలోపేతం ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదం పై చర్చిస్తారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్ధి శ్రీమతి రత్నప్రభ తరఫున ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఆ తరువాత  కోవిడ్ బారిన పడ్డ పవన్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్