నిఖిల్- అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి రూపొందించిన కార్తికేయ-2 పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.  దేశ వ్యాప్తంగా ఈ మూవీకి కలెక్షన్స్ రోజు రోజుకీ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే.. ఈ మూవీతో దర్శకుడు చందూ మొండేటి  తన సత్తా చాటాడు.  గత సినిమా ‘సవ్యసాచి’ ఆశించిన విజయం సాధించకపోవడంతో రేసులో  వెనుకబడిన చందు ‘కార్తికేయ 2’  మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు.

దీనితో చందూ తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్ కి ముందే ప్రముఖ గీతా ఆర్ట్స్ సంస్థ చందూ మొండేటికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసింది. వరుణ్ తేజ్ తో ఈ మూవీ వుండే అవకాశం వుందని టాక్… కానీ  చందూకి మాత్రం తమిళ హీరో కార్తీతో సినిమా చేయాలని వుందట.

చందు తదుపరి సినిమా వ‌రుణ్ తేజ్ తోనా లేక లేక కార్తితోనా అనేది ఆస‌క్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *