‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేసే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. రోజుకో పేరు వెలుగులోకి వస్తోంది. పలు సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు సైతం స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. తన ప్యానెల్ తెలంగాణ వాదమని వెల్లడించారు. తెలంగాణా కళాకారులు, వారు పడుతున్న ఇబ్బందులే తన అజెండా అని… ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన చిన్న, మధ్య తరగతి నటుల ఇబ్బందులపై కూడా పోరాడడమే లక్ష్యమన్నారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం అన్ని రకాల కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నాని ప్రకటించగానే.. నాన్ లోకల్ అనేది తెర పైకి వచ్చింది. కొంత మంది ప్రకాష్ రాజ్ ను మేం ఒప్పుకోం అంటున్నారు. ఇది వివాదస్పదం అవుతుంది. ఇదిలా ఉంటే.. అధ్యక్షుడుగా పోటీ చేస్తున్న వారి జాబితా రోజురోజుకు పెరుగుతుంది. ఎన్నికలకి ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి మరి కొంత మంది ఈ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఈ ఎన్నికలు ఇంకా ఎలాంటి వివాదాలు సృష్టిస్తాయో..? ఫైనల్ గా ఎవర్ని విజేతగా చేస్తుందో చూడాలి.