‘కేజీఎఫ్’ తో సంచలనం సృష్టించి పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యారు కన్నడ స్టార్ యశ్. యశ్ తో సినిమా చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే.. అతని నెక్ట్స్ మూవీపై ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు.
కన్నడ డైరెక్టర్ నర్తన్ చెప్పిన స్టోరీకి యశ్ ఓకే చెప్పారని.. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అని వార్తలు వచ్చాయి. హీరోయిన్ గా పూజా హేగ్డేను తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే.. ఆతర్వాత ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదని.. క్యాన్సిల్ అయ్యిందని గట్టిగా వినిపిస్తోంది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… యశ్ కి చెప్పిన కథనే నర్తన్ చరణ్ కి చెప్పారట. మిలటరీ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ స్టోరీ చరణ్ కి బాగా నచ్చిందట. ఆ తర్వాత చిరంజీవికి చెబితే.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో చరణ్, నర్తన్ మూవీ కన్ ఫర్మ్ అయ్యిందని.. ఇది చరణ్ 16వ సినిమాగా రానుందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈవిధంగా యశ్ నో చెప్పిన స్టోరీకి చరణ్ ఎస్ చెప్పాడు అంటున్నారు.