క‌న్న‌డ డైరెక్ట‌ర్ తో మూవీకి చరణ్ గ్రీన్ సిగ్నల్?

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. ఇటీవ‌ల లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టికీ… శంక‌ర్ ఇండియ‌న్ 2 సినిమా చేస్తుండ‌డంతో మ‌ళ్లీ చ‌ర‌ణ్ మూవీకి బ్రేక్ ప‌డింద‌ట‌. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో..?  ఎప్పుడు రిలీజ్ అవుతుందో..?  క్లారిటీ లేద‌ని తెలిసింది.

జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరితో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అందుక‌నే చ‌ర‌ణ్ వేరే మూవీని స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారట‌. ఇప్ప‌టి వ‌ర‌కు లోకేష్ క‌న‌క‌రాజ్ తో చ‌ర‌ణ్ మూవీ క‌న్ ఫ‌ర్మ్ అయ్యింద‌ని.. త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌ని ప్రచారం జ‌రిగింది. ఇటీవ‌ల‌ వేణు శ్రీరామ్ తో చ‌ర‌ణ్ సినిమా చేయ‌నున్నాడ‌ని టాక్ వ‌చ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. లోకేష్ క‌న‌క‌రాజ్, వేణు శ్రీరామ్ కాకుండా.. క‌న్న‌డ డైరెక్ట‌ర్ న‌ర్త‌న్ తో సినిమా చేయ‌డానికి చ‌ర‌ణ్ ఓకే చెప్పాడ‌ట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన మరో వారంలో రానున్నట్టు స‌మాచారం.

Also Read : చ‌ర‌ణ్ మూవీలో మోహ‌న్ లాల్? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *