Sunday, January 19, 2025
Homeసినిమాచ‌ర‌ణ్ పాత్ర త‌గ్గించ‌డానికి కార‌ణం..?

చ‌ర‌ణ్ పాత్ర త‌గ్గించ‌డానికి కార‌ణం..?

The Reason: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన భారీ, క్రేజీ మూవీ ఆచార్య‌. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చిరు స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 29న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చ‌ర‌ణ్ పాత్ర నిడివి గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏంటంటే.. ముందుగా చ‌ర‌ణ్ పాత్ర నిడివి 40 నిమిషాలు ఉంద‌ట‌. అయితే.. సినిమా ర‌న్ టైమ్ ఎక్కువుగా ఉండ‌డంతో ట్రిమ్ చేశారట‌. అలా చేయ‌డం వ‌ల‌న చ‌ర‌ణ్ పాత్ర‌ను 40 నిమిషాల నుంచి 25 నిమిషాల‌కు త‌గ్గించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. చ‌ర‌ణ్ క‌నిపించేంత సేపు చిరంజీవితో క‌లిసే స‌న్నివేశాలు ఉంటాయ‌ని.. ఈ సీన్స్ ప్రేక్ష‌కాభిమానుల‌కు థ్రిల్ క‌లిగించేలా ఉంటాయ‌ని అంటున్నారు. మ‌రి.. ఈ నెల 29న రానున్న ఆచార్య ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read : ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎప్పుడు? ఎక్క‌డ‌?

RELATED ARTICLES

Most Popular

న్యూస్