Friday, March 29, 2024
Homeసినిమాహీరోల రెమ్యూన‌రేష‌న్స్ పై వ‌ర్మ వ్యాఖ్య‌లు

హీరోల రెమ్యూన‌రేష‌న్స్ పై వ‌ర్మ వ్యాఖ్య‌లు

Now on Heroes: వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉంటుంటారు. త‌న మాట‌ల‌తో.. త‌న ట్వీట్స్ తో వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. కేజీఎఫ్ 2 రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతున్న విష‌యం తెలిసిందే. వ‌ర్మ‌ వరస ట్వీట్లతో కేజీఎఫ్ 2 చిత్రయూనిట్ పై, ముఖ్యంగా ప్రశాంత్‌ నీల్ పై ప్రశంసల వ‌ర్షం కురిపిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా కేజీయఫ్‌ సక్సెస్‌ని స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌తో ముడిపెడుతూ ట్వీట్‌ చేసి, ఇండస్ట్రీలో మరో వివాదానికి తెరలేపారు.

ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. సినిమా మేకింగ్ పై ఎంత ఎక్కువ డబ్బులు ఖ‌ర్చు పెడితే..అంత మంచి చిత్రాలు బయటకు వస్తాయని చెప్పడానికి కేజీఎఫ్ 2 మూవీయే ఉదాహరణ. మేకింగ్‌లో ఎంత క్వాలిటీ ఉంటే.. అంత భారీ సక్సెస్‌ వస్తుంది. అంతే కానీ.. స్టార్‌ హీరోలకు భారీ రెమ్యునరేషన్‌ ఇవ్వడం అనేది వృధా అని వ‌ర్మ‌ ట్వీట్‌ చేశాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో హీరోల రెమ్యూన‌రేష‌న్స్ ఎక్కువ‌. క‌న్న‌డ‌లో చాలా త‌క్కువ బ‌డ్జెట్ తోనే సినిమాలు తెర‌కెక్కుతాయి. ఇప్పుడు వ‌ర్మ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇంత చెబుతున్న వ‌ర్మ మేకింగ్ పై ఎక్కువ ఖ‌ర్చు పెట్టి మంచి సినిమాలు తీయ‌చ్చు క‌దా..?  అనే కామెంట్లు వ‌స్తున్నాయి. దీనికి వ‌ర్మ ఎలా స్పందిస్తాడో..

Also Read : ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ లో ‘కేజీఎఫ్-2 స‌రికొత్త రికార్డ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్