RC in Vizag: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, జయరామ్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఫస్ట్ షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేసుకుంది.
రెండవ షెడ్యూల్ రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు ప్రాంతాల్లో జరిగింది. మూడో షెడ్యూల్ ను పంజాబ్ లోని అమృత్సర్ లో కంప్లీట్ చేసుకుని వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. మే 5 నుంచి విశాఖపట్నంలో తర్వాతి షెడ్యూల్ మొదలు కాబోతోందని.. అక్కడ చెర్రీతో సహా ఇతర తారాగణం పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
మొత్తానికి చరణ్ శంకర్ తో కలిసి బ్రేకులు లేకుండా జెట్ స్పీడ్ తో ఆర్సీ 15 షూటింగ్ ను పూర్తి చేస్తుండటంతో.. మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. 2023 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : చరణ్ సినిమాలో అంజలి పాత్ర అదేనా?!