Thursday, March 28, 2024
Homeసినిమాసెట్స్ పైకి వ‌చ్చిన‌ 'ప్రాజెక్ట్ కె'

సెట్స్ పైకి వ‌చ్చిన‌ ‘ప్రాజెక్ట్ కె’

Prabhas on Track: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల ‘రాధేశ్యామ్‘ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను బాగా నిరాశ‌ప‌రిచింది. దీంతో ఇక నుంచి చేసే సినిమాల విష‌యంలో చాలా కేర్ తీసుకోవాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట ప్ర‌భాస్. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా వ‌చ్చే జ‌న‌వ‌రిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.
ఇక స‌లార్ సినిమా ఈ నెల‌లోనే తాజా షెడ్యూల్ ను స్టార్ట్ చేయ‌నున్నారు. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె అనే భారీ చిత్రం చేస్తున్నారు. దీనికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న బ‌లీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే నటిస్తోంది. వైజ‌యంతీ మూవీస్ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని అంత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్ర‌భాస్‌ ఈ షూటింగ్‌ సెట్స్ లో జాయిన్‌ అయ్యారు. ప్రభాస్, కొంత మంది ఫైట‌ర్స్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం వేసిన మూడు ప్రధాన సెట్స్‌లో ప్రస్తుతం టాకీ పార్ట్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెల 10 వరకు ఈ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్