Friday, March 29, 2024
Homeసినిమారాధేశ్యామ్'లో హైలైట్ సీన్స్ ఇవే! 

రాధేశ్యామ్’లో హైలైట్ సీన్స్ ఇవే! 

Highlights: ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ .. ప్రమోద్ .. ప్రసీద నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య థియేటర్లలో దిగిపోయింది. ప్రభాస్ క్రేజ్ కి తగినట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమా టాక్ ఏంటనే విషయాన్ని అలా ఉంచితే ఓ నాలుగు సీన్స్ మాత్రం హైలైట్ గా చెప్పుకుంటున్నారు.

ఇంటర్వెల్ కి ముందు ప్రేరణ (పూజ హెగ్డే) కోసం 300 కిలోమీటర్లు .. వర్షంలో బైక్ పై విక్రమాదిత్య (ప్రభాస్) వచ్చిన సీన్ బాగుంది. హీరో తనని ఎంతగా ఆరాధిస్తున్నది హీరోయిన్ కి ఈ సీన్ తోనే అర్థమవుతుంది. ‘నగుమోము’ సాంగ్ తో లింక్  అయిన ఈ సీన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేరణ ఎక్కువ కాలం బ్రతకదని తెలుసుకున్న విక్రమాదిత్య, ఆమె నూరేళ్లు బ్రతుకుతుందనీ .. తన జోస్యం ఎప్పుడూ తప్పుకాలేదని చెప్పే సీన్ కూడా హైలైట్ గా నిలుస్తుంది.

విక్రమాదిత్య మాటల్లో నిజం లేదనీ, నమ్మాల్సింది సైన్స్ ను కానీ జాతకాలను కాదని ప్రేరణ పెదనాన్న విక్రమాదిత్యకి ఒక టెస్ట్ పెడతాడు. విక్రమాదిత్య గొప్పతనాన్ని ఆయన తెలుసుకునే ఈ సీన్ కూడా బాగా పేలింది. ఇక సముద్రంలో షిప్పులో విక్రమాదిత్య ప్రయాణం చేస్తుండగా సునామీ రావడం .. ఆ ప్రమాదంలో ఆయన చిక్కుకున్న సీన్ ను కూడా బాగా తీశారు. ఈ నాలుగు సీన్స్  ఉత్కంఠభరితంగా అనిపిస్తాయి. మిగతా పాత్రలు బలంగా లేకపోవడం .. స్క్రీన్ ప్లే లోపం కాస్త అసంత్రిప్తిని కలిగించినా, సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్