Thursday, June 18, 2026
HomeసినిమాOwn Banner: చరణ్‌బ్యానర్ లో ఫస్ట్ మూవీ?

Own Banner: చరణ్‌బ్యానర్ లో ఫస్ట్ మూవీ?

రామ్ చరణ్‌ ఓవైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య చిత్రాలను నిర్మించారు. అయితే.. ఇప్పుడు మరో నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయడం విశేషం. యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో పార్టనర్ అయిన విక్కీ, చరణ్ కలిసి ‘V Mega Pictures’ అనే సంస్థను స్టార్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ బ్యానర్లో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు నిర్మించనున్నారు. అలాగే పాన్ ఇండియా సినిమాలు కూడా నిర్మించాలనుకుంటున్నారు.

ఈ బ్యానర్ ను చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ బ్యానర్ లో మొదటి సినిమాను అక్కినేని అఖిల్ తో అనే టాక్ వినిపిస్తోంది. చరణ్‌, అఖిల్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఆ స్నేహంతోనే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్, తారాగణంతో ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అఖిల్ చాలా డల్ అయ్యాడు. ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలనే కసితో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular