Sunday, September 8, 2024
HomeTrending News19 ఏళ్ల తర్వాత ఛార్లెస్ శోభరాజ్ కు విముక్తి

19 ఏళ్ల తర్వాత ఛార్లెస్ శోభరాజ్ కు విముక్తి

భారతీయ మూలాలున్న ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. 2003 నుంచి ఆయన నేపాల్ లోని ఖాట్మండు జైల్లో ఉంటున్నాడు. వృద్ధాప్యం కారణలతో శోభరాజ్ ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లోగా శోభరాజ్ ను ఆయన దేశానికి పంపించాలని ఆదేశాలను జారీ చేసింది.

శిక్షాకాలం కంటే ఎక్కువ కాలం తాను జైల్లో గడిపానని శోభరాజ్ నేపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. నేపాల్ లో సీనియర్ సిటిజెన్లకు ఇచ్చిన సడలింపు ప్రకారం తాను పూర్తి కాలం శిక్షను అనుభవించానని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. 75 శాతం శిక్ష అనుభవించి, సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలను విడుదల చేసేందుకు నేపాల్ లో చట్టపరమైన నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది.

శోభరాజ్ తండ్రి ఇండియన్ కాగా తల్లి వియత్నాం జాతీయురాలు. ఆయన 20కి పైగా హత్యలు చేశాడు. శోభరాజ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో సినిమా కూడా వచ్చింది. ‘మే ఔర్ ఛార్లెస్’ పేరుతో 2015లో విడుదలైన ఈ చిత్రంలో శోభరాజ్ పాత్రను రణదీప్ హుడా పోషించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్