ప్రేక్షకుల అభిరుచి మారింది: చార్మీ

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ ల కాంబినేష‌న్లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘లైగ‌ర్’. రిలీజ్ కి ముందు ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం అనుకున్నారు.  పూరి, ఛార్మి, క‌ర‌ణ్ జోహార్ అయితే.. లైగ‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 1000 కోట్లు సాధించ‌డం ప‌క్కా అనే న‌మ్మ‌కంతో ఉన్నారు. ఆగ‌ష్టు 25న లైగ‌ర్ రిలీజ్ అయిన ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. టీమ్ అంతా షాక్ కి గుర‌య్యారు.

లైగ‌ర్ ప్లాప్ పై  ఛార్మి స్పందించారు… “జనాలు ఇంట్లోనే కూర్చొని ఒక్క క్లిక్ తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, భారీ బడ్జెట్ మూవీలను చూసే పరిస్థితి ఇప్పుడు వ‌చ్చింది. ఒక సినిమా కోసం థియేటర్ కి రాక ముందే అనేక అంశాలపై ప్రేక్షకులు దృష్టి సారిస్తున్నారని” అన్నారు. దక్షిణాదిలో గతంలో ఉన్నంత సినిమా పిచ్చి ఇప్పుడు లేదనిపిస్తోందన్నారు. బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని,   ఎన్నో కష్టాలు పడి తాము ఈ చిత్రాన్ని నిర్మించామని, కానీ ఫలితం నిరాశకు గురి చేసిందని ఛార్మీ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read అయ్యో పాపం .. అనన్య 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *