Saturday, January 18, 2025
Homeజాతీయంకలెక్టర్ ను సస్పెండ్ చేసిన సిఎం

కలెక్టర్ ను సస్పెండ్ చేసిన సిఎం

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ రణ్ బీర్ శర్మను ముఖ్యమంత్రి  భూపేష్ బెఘల్ సస్పెండ్ చేశారు. లాక్ డౌన్  పర్యవేక్షిస్తున్న సందర్భంలో ఓ వ్యక్తిపై రణ్ బీర్ దురుసుగా ప్రవర్తించారు. మందులు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నానని చెప్పినా వినకుండా అతని చెంపపై చేయి చేసుకున్నారు. సదరు వ్యక్తి మొబైల్ లాక్కుని నేలపై విసిరి కొట్టారు, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులను పిలిచి అతన్ని  కొట్టాల్సిందిగా ఆదేశించారు.   ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు కలెక్టర్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు.

ఆ రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఈ ఘటనను తప్పుబట్టింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరింత సంయమనంతో విధులు నిర్వహించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కొట్టడం సమంజసం కాదని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడంతో కలెక్టర్ రణ్ బీర్ శర్మను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, జరిగిన సంఘటన పట్ల రణ్ బీర్ క్షమాపణలు చెప్పారు.  ఆ వ్యక్తి స్పోర్ట్స్ బైక్ పై వేగంగా వెళ్తున్నారని, ఆపి విచారిస్తే నకిలీ వాక్సిన్ సర్టిఫికేట్ చూపించారని వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు సక్రమంగా అమలు చేయాలంటే కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని అన్నారు. అయినా సరే తాను అలా చేసి ఉండాల్సింది కాదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్